అరువది ఆరేళ్ళ స్వతంత్ర భారత దేశం–అవినీతి పెచ్చు పెరిగిపోయింది. నల్లధన రాశులు పరాయి కొంపలలో కోకొల్లలుగా ఉన్నాయి. ఆధనమంతా మనలను పీడించి సంపాదించినదే మనదే కదా! దాన్ని రప్పించి దేశ పురోభివృద్ధికి ఖర్చు చేయాలి. ప్రపంచ దేశాలలో భారతదేశం అగ్రగామి కావాలి. పేదవాడు పేదవాడుగానే మిగిలిపోతున్నాడు. ధనవంతుడు కోట్లకు పడగెత్తుతున్నాడు. కారణం ఎవరు. ప్రజలా రాజకీయమా? 2014 ఎలక్షన్లలోనైనా మనలను ఉద్ధరించే వారిని చూసి మరీ ఎన్నుకోవాలి. మన భారత దేశం రామరాజ్యం కావాలి. భావి భారత నిర్మాతలు ప్రజలే కదా!!